ఉచిత హామీలపై సుప్రీం కోర్టులో విచారణ
Supreme Court: అధికారమే లక్ష్యంగా వివిధ రాజకీయపార్టీలు గుప్పించే ఉచిత హామీలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Supreme Court: అధికారమే లక్ష్యంగా వివిధ రాజకీయపార్టీలు గుప్పించే ఉచిత హామీలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచితాలు, సాంఘిక సంక్షేమ పథకాలు రెండు వేర్వేరు విషయాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. నష్టపోతున్న ఆర్థిక వ్యవస్థ, సంక్షేమ పథకాల మధ్య సమతుల్యత సాధించాలని సూచించింది. ఈ అంశంలో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆయా రాజకీయ పార్టీలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
పూర్తి వివరాలు అందాకే ఉచిత హామీలపై ఏ మేరకు జోక్యం చేసుకోవాలన్నది పరిశీలిస్తామన్నారు CJI NV రమణ. మరోవైపు ఉచిత హామీల పరిశీలనకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘం తెలిపాయి. అంతకుముందు పిటిషనర్ అశ్వినీ ఉపాధ్యాయ ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. వాదోపవాదాలు విన్న అనంతరం విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు ప్రకటించింది.