Supreme Court: రాజకీయాల్లో నేరచరితుల కట్టడికి సుప్రీం సరికొత్త చర్య

Supreme Court: సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2021-08-10 09:45 GMT

Supreme Court: రాజకీయాల్లో నేరచరితుల కట్టడికి సుప్రీం సరికొత్త చర్య

Supreme Court: సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల విచారణ వేగంగా జరపాలన్న పిటిషన్లపై సీజేఐ రమణ, జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసం విచారణ చేపట్టింది. ఈ కేసుల విచారణలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సరిగ్గా లేదని సుప్రీం మండిపడింది. కేసుల స్టేటస్‌ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. 

ఇలా ప్రతిసారి సమయం కోరడంపై సీజేఐ రమణ అసహనం వ్యక్తం చేశారు. ఆగస్ట్‌ 25లోపు దేశంలో ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల విచారణ స్టేటస్‌ రిపోర్ట్ అందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఎన్నికల వేళ ఆయా పార్టీలు అభ్యర్థుల నేరచరిత్రను 48 గంటలలోపు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేరచరిత్రను బహిర్గతం చేయని పార్టీల గుర్తును నిలిపివేయాలంటూ ఈసీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News