నీట్ పరీక్ష ఆదివారమే.. వాయిదా వేయడం కుదరదన్న సుప్రీంకోర్టు
* యథాతధంగా నిర్వహించాలని ఆదేశాలు * సెప్టెంబర్ 12న నీట్ ప్రవేశ పరీక్ష
Supreme Court: 'నీట్' పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు 'నో' అని చెప్పేసింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారమే ఈ పరీక్షను జరపాలని అధికారులను ఆదేశించింది. నీట్ పరీక్ష రోజునే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉన్నాయని, అలాగే CBSE కంపార్ట్‌మెంట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని, అందువల్ల మరో తేదీకి వాయిదా వేయాలని కొందరు పిటిషన్లు దాఖలు చేయగా, ఈ పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12, ఆదివారమే జరుగుతుందని సుప్రీం స్పష్టం చేసింది.