Supreme Court: తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెంపదెబ్బ.. రిజర్వేషన్లు రద్దు...
Supreme Court: వణ్నియార్ కులస్తులకు 10.5 శాతం రిజర్వేషన్లు రద్దు...
Supreme Court: తమిళనాడులో వన్నియార్ కులస్తులకు ఎంబీసీ కోటా నుంచి 10.5 శాతం రిజర్వేషన్లు కేటాయించడాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎంబీసీల్లో వన్నియార్ కులస్తులు మరింతగా వెనుకబడి ఉన్నారనడానికి సంతృప్తికరమైన డేటా ఏదీ లేదని కోర్టు వ్యాఖ్యానించింది. వెనుకబడి ఉన్నారనడానికి ప్రాతిపదిక కులమే అయినప్పటికీ.. గంపగుత్తగా వెనుకబడి ఉన్నారని చెప్పడానికి సంతృప్తికరమైన ఆధారం లేదన్నారు.
ఈ విషయంలో తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎల్.నాగేశ్వరరావు, బీఆర్ గవాయి సమర్థిస్తూ తీర్పునిచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో తమిళనాడు ప్రభుత్వం వణ్యకుల క్షత్రియుల కోసం పదిన్నర శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.