Supreme Court: ఫైర్‌క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

* బాణసంచాపై పూర్తి నిషేధం లేదని క్లారిటీ * బేరియం సాల్ట్స్‌ ఉన్న క్రాకర్స్‌పై మాత్రమే నిషేధం

Update: 2021-10-30 01:14 GMT

సుప్రీంకోర్టు (ఫైల్ ఫోటో)

Supreme Court: దీపావళి రోజు వాడే ఫైర్‌క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాణసంచాపై పూర్తి నిషేధం లేదని క్లారిటీ ఇచ్చింది అయితే బేరియం సాల్ట్స్‌ ఉన్న క్రాకర్స్‌పై మాత్రమే నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. వేడుకల పేరుతో ఇతరుల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్రాలు, ఏజెన్సీలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించాలని, అతిక్రమిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Tags:    

Similar News