నీట్ పీజీ కౌన్సెలింగ్ 2021కి ఆమోదం తెలిపిన సుప్రీంకోర్టు.. OBC, EWS రిజర్వేషన్లు వర్తిస్తాయి..

NEET PG Counseling 2021: నీట్ పీజీ కౌన్సెలింగ్ 2021కి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది...

Update: 2022-01-08 11:30 GMT

నీట్ పీజీ కౌన్సెలింగ్ 2021కి ఆమోదం తెలిపిన సుప్రీంకోర్టు.. OBC, EWS రిజర్వేషన్లు వర్తిస్తాయి..

NEET PG Counseling 2021: నీట్ పీజీ కౌన్సెలింగ్ 2021కి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఇది కాకుండా OBC రిజర్వేషన్, EWS కోటాపై నిర్ణయం తెలిపింది. ఈ కేసును జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న ధర్మాసనం విచారించి నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏం చెప్పిందంటే..?

OBC రిజర్వేషన్

NEET PG 2021లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ అంశంపై, 'OBC రిజర్వేషన్ చెల్లుబాటును మేము సమర్థిస్తున్నాము' అని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే ఓబీసీ కేటగిరీ విద్యార్థులు ఈ సారి నుంచే అడ్మిషన్‌లో 27 శాతం రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతారు.

EWS రిజర్వేషన్

NEET PG అడ్మిషన్ 2021లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్‌పై అంటే EWS కోటాపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ప్రస్తుతానికి సమర్థించారు. అంటే మెడికల్ పీజీ అడ్మిషన్ 2021లో, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల వరకు ఉన్న విద్యార్థులందరికీ రిజర్వేషన్ ప్రయోజనం అందుతుంది.

'ప్రస్తుతం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను 8 లక్షల ఆదాయ పరిమితిలో ఇవ్వవచ్చని, తద్వారా ఈ అకడమిక్ సెషన్‌లో ప్రవేశానికి ఎటువంటి సమస్య లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే ఈ ఆదాయ పరిమితిపై సుప్రీంకోర్టు విచారణను ఇంకా కొనసాగిస్తుంది. మార్చి 2022లో ఈ ఆదాయ పరిమితి సరైనదేనా కాదా అని కోర్టు చివరకు నిర్ణయిస్తుంది.

నీట్ పీజీ 2021లో 27 శాతం ఓబీసీ, 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ జూలైలో ఈ రిజర్వేషన్‌కు సంబంధించిన నోటీసు జారీ చేశారు. ఏప్రిల్‌లో పరీక్ష జరగాల్సి ఉండగా కోవిడ్ 19 కారణంగా పరీక్ష వాయిదా పడింది. అది సెప్టెంబర్ 2021లో జరిగింది. అయితే ఈ అకడమిక్ సెషన్ నుంచి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లను అమలు చేయరాదని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇది కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలుగా నిర్ణయించింది, దీనిని చాలా మంది వ్యతిరేకించారు. 8 లక్షల పరిమితి చాలా ఎక్కువని అభ్యర్థులు ఆందోళన చెందారు.

Tags:    

Similar News