Supreme Court: స్టెరిలైట్ పరిశ్రమను ఓపెన్ చేయడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
Supreme Court: తమిళనాడులోని తూత్తుకుడిలోని వేదాంతా స్టెరిలైట్ పరిశ్రమను పునరుద్దరించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
Supreme Court: తమిళనాడులోని తూత్తుకుడిలోని వేదాంతా స్టెరిలైట్ పరిశ్రమను పునరుద్దరించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కరోనా ఉధ్దృతి దృష్ట్యా ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ఈ పరిశ్రమ తిరిగి తెరిచేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. ప్రాణవాయువు మాత్రమే ఉత్పత్తి చేయాలని, ఇతర అవసరాలకు నడపకూడదని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. స్టెరిలైట్ పరిశ్రమ కాలుష్యానికి కారణమవుతోందని 2018లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమను మూసివేసింది.
మరోవైపు తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బెడ్స్, ఆక్సిజన్ లేక కరోనా రోగులు ప్రాణాలు విడుస్తున్నారు. దీంతో ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా తమిళనాడులో 24గంటల్లో 94మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా తమిళ నాడు లో మరణించిన వారి సంఖ్య 13651 చేరింది. ఒక్కరోజులోనే కోవిడ్ 15వేల మందిపైగా కొరోనా బారిన పడ్డారు.