లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తాం : యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్

రోనా కొత్త స్ట్రెయిన్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)ను మరింత కలవరానికి గురిచేస్తుంది.

Update: 2021-01-04 02:07 GMT

 కరోనా కొత్త స్ట్రెయిన్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)ను మరింత కలవరానికి గురిచేస్తుంది. రోజురోజుకు స్ట్రెయిన్ కేసుల సంఖ్య గణణీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటి్కే విధించిన లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని ఆదేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. చలికాలం రానుండటంతో పరిస్థితిని అదుపులోని తెచ్చేం దుకు ఇంకొన్ని వారాల పాటు ఆంక్షలు అమలు చేయక తప్పదని ఆయన పేర్కొన్నారు. కర్ఫ్యూ విధింపు, పాఠశాలల మూసివేత, ఒకరినొకరు కలసుకోవడంపై నిషేధం విధించనున్నట్లు సమాచారం.

కొత్త స్ట్రెయిన్‌ విజృంభణ నేపథ్యంలో పాఠశాలలను కొన్ని వారాలు మూసివేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. బడులు సురక్షితమని, పిల్లలకు కొత్త స్ట్రెయిన్‌ ముప్పు చాలా తక్కువని బోరిస్‌ అన్నారు. బ్రిటన్‌లో శనివారం ఒక్కరోజే అత్యధికంగా 57,725 కేసులు నమోదయ్యాయి. సోమవారం నుంచి బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనకా టీకా పంపిణీ ప్రారంభం కానుంది. మరోవైపు మెరికాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. శనివారం ఏకంగా 2.77 లక్షల కేసులు నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో మొత్తం మరణాలు 3.50 లక్షలకు చేరాయి. ఇప్పటికి 42 లక్షల మందికే టీకా వేశారు. టీకాకు రవాణా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

Tags:    

Similar News