నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
Stock Market: 951 పాయింట్ల నష్టంతో 57,999 వద్ద కొనసాగుతున్న సెన్సెక్స్. 280 పాయింట్ల నష్టంతో 17,325 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ.
Stock Market: స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మూడు రోజులుగా వరుస లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాస్‌లో ఉండటం మదుపర్లను ప్రభావితం చేసింది. అమెరికా ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచవచ్చన్న వార్తలు ట్రేడింగ్‌పై ఎఫెక్ట్ చూపాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కూడా నష్టాలు పెరిగేందుకు కారణమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 950కి పైగా పాయింట్ల నష్టంతో 57వేల 955 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 250 పాయింట్లు లాసై 17వేల 316 వద్ద కొనసాగుతోంది.