TamilNadu: మోదీ పై స్టాలిన్ సంచలన ఆరోపణలు
Tamil Nadu: సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ మరణాలకు మోదీనే కారణమని ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు.
Tamil Nadu: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి పళనిస్వామిపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'సీఎం పళనిస్వామి.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాలికి వేసుకున్న చెప్పు పాటి విలువ కూడా చేయరు' అంటూ రాజా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇది మరువక ముందే ప్రధాని నరేంద్రమోదీపై స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ మరణాలకు మోదీనే కారణమని, ఆయన పెట్టే ఒత్తిడి తట్టుకోలేకే వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాలు కత్తులు దూసుకుంటున్న వేళ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రధాని నరేంద్రమోదీపై స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ మరణాలకు మోదీనే కారణమని, ఆయన పెట్టే ఒత్తిడి తట్టుకోలేకే వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాలు కత్తులు దూసుకుంటున్న వేళ ఉదయనిధి చేసిన పెద్ద చర్చకు దారితీశాయి.
అన్ని విషయాల్లో ఆరితేరిన బిజెపి ఊరుకుంటుందా ఇటు సుష్మ స్వరాజ్ కుమార్తె, అరుణ్ జైట్లీ కుమార్తెను రంగంలోకి దింపింది. ఉదయనిధి వ్యాఖ్యలపై సుష్మ స్వరాజ్ కుమార్తె భానుశ్రీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉదయనిధి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, మోదీకి తన తల్లి ఎంతగానో విలువనిచ్చే వారని అన్నారు. జైట్లీ కుమార్తె సో నాలీ జైట్లీ కూడా ఉదయనిధి వ్యాఖ్యలకు బదులిచ్చారు. ఉదయనిధి ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారన్న విషయం తమకు తెలుసని, అయితే, తన తండ్రిని అగౌరవపరిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. మొత్తానికి తమిళనాడులో పొలిటికల్ హీట్ రగులుతోంది.