శ్రీలంక దేశ అధ్యక్షుడు రాజపక్స కీలక నిర్ణయం
Sri Lanka: *శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధింపు *నిత్యావసరాల కోసం అల్లాడుతున్న ప్రజలు
Sri Lanka: తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత ఎదుర్కొంటున్న శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించారు. ఏప్రిల్ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈమేరకు శ్రీలంక దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స గెజిట్ జారీ చేశారు. ఇటీవల శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజల భద్రత, అత్యవసర సేవలు , నిత్యావసరాల సరఫరా నేపథ్యంలో ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీలంకలో కొద్ది రోజులుగా ప్రజలు నిత్యావసరాల కోసం అల్లాడిపోతున్నారు. పెరిగిన ధరలు, ఆహార పదార్థాల కొరత, విద్యుత్ కోతలు, ఇంధన కొరతతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. గురువారం రాత్రి వేలాది మంది అధ్యక్ష భవనం ముట్టడించారు. అధ్యక్ష స్థానం నుంచి రాజపక్స తప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు. కొలోంబోలని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు.