Special gift for ayodhya bhumi puja guests: అయోధ్య భూమి పూజకు హాజరయ్యే అతిధులకు అపురూప కానుక!

Special gift for ayodhya bhumi puja guests: అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు కొన్ని గంటలు మాత్రమె సమయం ఉంది.

Update: 2020-08-04 18:52 GMT

అయోధ్యలో రేపటి (ఆగస్టు 05) న భూమిపూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ల కల సాకారం అవ్వడానికి పునాదిరాయి పడనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారు. ఆయనతో పాటూ దేశంలోని దాదాపు 100 మందికి పైగా హాజరవుతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు అందిన వారికి మాత్రమే భూమిపూజ కార్యక్రమ ప్రాంగణంలోకి ప్రవేశం ఉంటుంది.

అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి హాజరవుతున్న అతిథులకు శ్రీరాముని పట్టాభిషేక ముద్రతో ఉన్న వెండి నాణెం బహూకరించనున్నారు. ఈ నాణెం రెండో వైపు రామ దర్బార్ ఉంటుంది. అతిధులుగా వచ్చిన వారందరికీ రామ ప్రసాదంగా ఈ నాణేలను అందించనున్నారు. అంతే కాకుండా అతిదులందరికీ లడ్డూలు, శ్రీరామ దర్బార్ చిత్ర పటంతో పాటు ఉన్న ఒక బాక్స్ అందించనున్నారు. అంతేకాకుండా, దాదాపు లక్షా పాతిక వేల లడ్డూలను అతిథులతో పాటు అయోధ్య నగరంలోని అందరికీ రఘుపతి లడ్డూ పేరుతో ప్రసాదంగా అందించనున్నారు. 

ఇక, ఆహ్వానం కలిగిన వారంతా ఉదయం 10.30 గంటలకల్లా అతిధులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. ప్రతి ఆహ్వాన పత్రికకు సెక్యూరిటీ కోడ్. కెమెరాలు , ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అతిధులు తీసుకురావడానికి అనుమతి లేదు. భూమిపూజ కార్యక్రమానికి దేశంలోని 2 వేల ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టి, 100 నదుల నుండి నీరు వినియోగం ఉపయోగిస్తున్నారు. 






Tags:    

Similar News