దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంపై సోనియాగాంధీ ఆవేదన

Update: 2019-09-13 15:45 GMT

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో సోనియాగాంధీ సమావేశం అయ్యారు. దేశ ఆర్థిక సంక్షోభం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, వందరోజుల పాలన, జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు వంటి అంశాలపై నేతలతో సోనియగాంధీ చర్చించారు. సమావేశంలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంపై సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలంతా ప్రజలకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. సోషల్‌ మీడియా పోస్టులకు స్వస్తి పలికి ప్రత్యక్ష రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించాలని సోనియా దిశానిర్దేశం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, సర్థార్‌ వల్లబాయ్‌పటేల్‌, నెహ్రూ ఆశయాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోందని ఈ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సోనియాగాంధీ పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News