National Herald Case: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ.. ఒకేవిధంగా సమాధానమిచ్చిన రాహుల్, సోనియా!

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది.

Update: 2022-07-27 13:00 GMT

National Herald Case: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ.. ఒకేవిధంగా సమాధానమిచ్చిన రాహుల్, సోనియా!

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. మూడు రోజుల పాటు 12గంటలు సోనియాను ఈడీ అధికారులు విచారించారు. ఈనెల 21న విచారణ సందర్భంగా మూడు గంటల పాటు సోనియాపై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు, మంగళవారం ఆరు గంటలు, బుధవారం రెండు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో భాగంగా రాహుల్ గాంధీ చెప్పిన విషయాలనే సోనియాగాంధీ ఈడీకి తెలిపినట్లు తెలుస్తోంది. మొదటి రెండు రోజుల విచారణలో అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ , యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ముడిపడి ఉన్న ఆర్థిక లావాదేవీల గురించి సోనియాను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

రెండు రోజుల విచారణలో 8 గంటలకు పైగా సోనియా గాంధీని ప్రశ్నించగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ పాత్ర గురించి, ఈ కంపెనీ ద్వారా ఎవరైనా ఏదైనా ద్రవ్య లాభం పొందారా అని అడిగినప్పుడు ఈడీకి రాహుల్ తెలిపిన సమాధానమే సోనియా గాంధీ ఇచ్చినట్లు తెలిసింది. బుధవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఈడీ అధికారులు సోనియాను ప్రశ్నించారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో భోజన విరామం ఇచ్చిన అధికారులు తొలుత మధ్యాహ్నం 3.30 గంటలకు మళ్లీ రావాలని సోనియాకు తెలిపారు. కానీ తర్వాత మళ్లీ విచారణ ముగిసిందని ఈడీ కేంద్ర కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే అవసరమైతే మరోసారి పిలుస్తామని ఈడీ అధికారులు చెప్పినట్లు తెలిసింది. 

Tags:    

Similar News