సోనాలీ ఫోగట్ మర్డర్ మిస్టరీ చేధించేందుకు పోలీసుల ప్రయత్నం.. బలవంతంగా..
Sonali Phogat: బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగట్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంపై పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Sonali Phogat: బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగట్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంపై పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సోనాల్ ఫోగట్ మర్డర్ మిస్టరీ చేధించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత గుండెపోటుతో మృతి చెందిందని అనుకున్నారు. ఆ తర్వాత పోస్టుమార్టం నివేదికతో మర్డర్ కేసుగా నమోదు చేశారు. దీంతో ఆమె ఇద్దరు సహాయకులపై కేసు నమోదు చేశారు. బలవంతంగా డ్రగ్స్ ఇచ్చినట్లు పోస్టుమార్టం నివేదికవెల్లడించింది.
సోనాలీ ఫోగట్‌కు పార్టీలో ఓ అనుమానితుడు బలవంతంగా మత్తుపదార్ధం ఇవ్వడంవల్లే స్పృహ కోల్పోయిందని పోలీసులు గుర్తించారు. ఆ కెమికల్ సేవించిన అనంతరం పట్టు కోల్పోయిందని నిర్థారణకొచ్చారు. స్ప్రహ కోల్పోయిన అనంతరం అనుమానితుడు ఆమెను టాయిలెట్‌లోకి తీసుకువెళ్లాడని, ఆపై రెండు గంటల పాటు ఏం జరిగిందనేది వెల్లడి కావడం లేదని గోవా పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. ఈ కేసులో ఇద్దరి నిందితులను అరెస్టు చేశామని గోవా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఓంవీర్ సింగ్ విష్ణోయ్ తెలిపారు.
సోనాలీ ఫోగట్ పై ఆమె సోదరుడు రింకు ధాకా సంచలన ఆరోపణలు చేశారు. సోనాల్ పై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని, ఆస్తికోసమే ఆమెను హతమార్చి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. హరియాణాలోని ఆదంపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోనాలీ ఫోగాట్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆ ఎన్నికలో ఆమె ఓడిపోయారు. ఆమె భర్త కొన్నేళ్ల కిందటే మృతి చెందారు. వారికి ఒక కుమార్తె ఉంది.