Indian Railways: రైళ్ళలో పొగతాగితే జరిమానా, జైలు

Indian Railways: రైళ్ళలో పొగ తాగేవారిపై భారీ జరిమానాలు విధించాలని రైల్వే శాఖ భావిస్తోంది.

Update: 2021-03-20 16:30 GMT

Indian Railways: రైళ్ళలో పొగతాగితే జరిమానా, జైలు

Indian Railways: రైళ్ళలో పొగ తాగేవారిపై భారీ జరిమానాలు విధించాలని రైల్వే శాఖ భావిస్తోంది. స్మోకర్స్‌ వల్ల జరిగే నష్టం తీవ్రతను బట్టి పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తారు. నిందితులను అరెస్టు చేసేందుకు వీలుగా కూడా నిబంధనలను తయారుచేయాలని ఆలోచిస్తోంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు నేపథ్యంలో రైల్వే శాఖ సమాలోచనలు చేస్తోంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఎస్5 కోచ్‌లో కాల్చిన సిగరెట్ పీకలను టాయ్‌లెట్‌లో పడేయడంతో, అక్కడ ఉన్న టిష్యూ పేపర్ కాలిపోయి, అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన తర్వాత స్మోకర్స్‌ భరతం పట్టే దిశగా రైల్వే శాఖ కదులుతోంది.

Tags:    

Similar News