Virgin Galactic: చరిత్ర సృష్టించిన బండ్ల శిరీష

Virgin Galactic: వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అంతరిక్ష యాత్ర విజయవంతం కావడంతో ప్రశంసలు వెలువెత్తాయి.

Update: 2021-07-12 03:11 GMT

Sireesha Bandla:(Time)

Virgin Galactic: కల కన్నది. సాకారం చేసుకున్నది. అనుకున్నది సాధించింది. తెలుగువారి కీర్తి పతాకాన్ని అంతరిక్షంలో ఎగరేసింది. రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటి వ్యోమగాముల స్థాయి కాకపోయినా.. వారి తర్వాత మళ్లీ అంతరిక్షంలో విహరించిన భారతీయురాలు.. తెలుగమ్మాయి బండ్ల శిరీష మాత్రమే. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన అంతరిక్ష నౌకలో 90 నిముషాల పాటు అంతరిక్షంలో విహరించి విజయవంతంగా భూమి మీదకు అడుగు పెట్టింది శిరీష. వెళ్లిన ఆరుగురు వ్యోమగాముల్లో వయసు రీత్యా చిన్నది శిరీష కావడం విశేషం.

కంటిచూపులో నాసా విధించిన నిబంధనల స్థాయిలో విఫలం కావడంతో.. కుదరలేదు.. లేదంటే నాసా తరపునే బండ్ల శిరీష అంతరిక్షయానం చేసేదే. అయినా నిరాశ చెందకుండా.. ఒక అవకాశంలా కనపడ్డ వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో చేరి.. తన కలను నెరవేర్చుకుంది. జెయింట్ వీల్ ఎక్కడానికే భయపడేవారు ఇప్పటికీ ఉన్నారు.. అలాంటిది విమానం కాకుండా ఏకంగా రాకెట్ ఎక్కి.. ఒక వ్యోమనౌకలో ప్రయాణం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అలా చేయాలంటే ఎంతో మానసిక స్థైర్యం కలిగి ఉండాలి. అది తనకు ఉందని శిరీష నిరూపించుకుంది.

తన స్వస్ధలం అయిన గుంటూరు జిల్లాలో అయితే బంధువులంతా టీవీ లైవ్ చూస్తూ.. దిగి వచ్చేవరకు టెన్షన్ అనుభవించారు. సక్సెస్ ఫుల్ గా తిరిగొచ్చింది అని తెలియగానే స్వీట్లు పంచుకున్నారు. తమ అమ్మాయి ఈ ఘనత సాధించిందని వారంతా గర్వంతో ఉప్పొంగిపోయారు. ప్రపంచమంతా ఒక చర్చ అయితే.. భారతదేశంలో మాత్రం శిరీష గురించే చర్చ. చిన్న వయసులోనే అంతరిక్షయానం చేసి వచ్చింది. చిన్నతనంలోనే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అనేది అంత తేలిక కాదు.. చాలామందికి అధి సాధ్యమే కాదు. అలాంటిది తన కుటుంబం అమెరికా వెళ్లి స్ధిరపడటం... అక్కడకు వెళ్లినా తన స్సేస్ జర్నీ డ్రీమ్ ను వదిలిపెట్టకుండా ప్రయత్నించి విజయం సాధించింది శిరీష.

Tags:    

Similar News