Bappi Lahiri: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూత

Bappi Lahiri: ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి

Update: 2022-02-16 04:00 GMT

Bappi Lahiri: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూత

Bappi Lahiri: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పి లహరి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఒంటి నిండా బంగారంతో ప్రత్యేకంగా కనిపించే బప్పి లహరి 1980, 90వ దశకాల్లో డిస్కో మ్యూజిక్ తో భారతీయ సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపేషారు. గ్యాంగ్ లీడర్, సింహాసనం, స్టేట్ రౌడీ అల్లుడు, దొంగ, పోలీసు, బ్రహ్మ, బిగ్ బాస్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన చల్తే చల్తే, డిస్కో డ్యాన్సర్. షరాబీ వంటి పలు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. 2014న బీజేపీలో చేరారు. బెంగాల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. 1952 నవంబర్ 27న బప్పి లహరి జన్మించారు. బప్పి లహరి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  

Tags:    

Similar News