Silver Betel From Kasi: కాశీ నుంచి వెండి తమలపాకులు.. ముస్లిం లాయర్ కు తొలి ఆహ్వానం
Silver Betel From Kasi: ప్రస్తుతం అయోద్యలో నిర్మాణం చేసే రాముని ఆలయానికి ఎంత విశిష్టత ఉందో అంతకు మించి ప్రాధాన్యత ఉంది.
Silver Betel From Kasi: ప్రస్తుతం అయోద్యలో నిర్మాణం చేసే రాముని ఆలయానికి ఎంత విశిష్టత ఉందో అంతకు మించి ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు భూమి పూజలో పలువురు అందించిన వెండి ఇటుకలతో పాటు తాజాగా కాశీ నుంచి వెండితో చేసిన తమలపాకులను రప్పిస్తున్నారు.
హిందూ మతంలో తమలపాకులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇళ్లు, ఆలయాలు ఇలా ఎక్కడ ఏ పూజ చేసినా తమలపాకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ నెల ఐదున అయోధ్యలో జరిగే రామ మందిర భూమి పూజకు కాశీ నుంచి వెండి తమలపాకులు తరలి వెళ్లాయి. నాడు నిర్వహించే భూమి పూజ కార్యక్రమంలో ఈ వెండి తమలపాకులను వినియోగించనున్నారు. వారణాసిలోని కాశీ చౌరాసియా సంఘానికి చెందిన వారు వెండితో ప్రత్యేకంగా ఐదు తమలపాకులను తయారు చేయించారు. ఆ సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్ చౌరాసియా వీటిని వేద పండితులకు అందజేయగా.. వారు వీటిని తీసుకుని నేడు అయోధ్యకు బయలుదేరారు.
అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తిగా రాతితోనే జరగునున్న సంగతి తెలిసిందే. నిర్మాణంలో ఇనుము, ఉక్కు వినియోగించడం లేదని.. మందిర నిర్మాణ పర్యవేక్షకుడు అను భాయ్ సోంపురా తెలిపారు. తాను గత 30 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నాను అన్నారు. మందిర నిర్మాణానికి ఇక్కడ లభించే రాళ్లతో పాటు.. రాజస్తాన్ నుంచి కూడా తెప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేవలం 180 మంది మాత్రమే హాజరవుతున్నారు.
ఈ విధంగా అయోధ్యలో జరిగే రామమందిరం భూమి పూజ కార్యక్రమానికి పిలుపులు మొదలయ్యాయి. హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటి ఆహ్వాన పత్రికను అయోధ్య భూ వివాద కేసులో ముస్లింల తరుఫున వాదించిన న్యాయవాదుల్లో ఒకరైన ఇక్బాల్ అన్సారీకి నిన్న అందచేశారు.
అయోధ్య భూవివాదంలో ముస్లింల తరుఫున బలంగా వాదించిన న్యాయవాదుల్లో అన్సారీ ఒకరు. ఈ సందర్భంగా ఇక్బాల్ మాట్లాడుతూ…. ఇది సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడి కోరిక అయ్యి ఉంటుంది. అందుకే నాకు మొదటి ఆహ్వాన పత్రిక అందింది.
నేను దీన్నిమనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అయోధ్యలో హిందూ ముస్లింలు సోదర భావంతో మెలుగుతారు అని ఆనందం వ్యక్తం చేసారు. రామ మందిరానికి సంబంధించి ఎటువంటి మతపరమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినా వెళతాను.