S Jaishankar: ఆత్మ పరిశీలన చేసుకోండి.. పాక్‌లోనే దాయాదికి ఇచ్చిపడేసిన విదేశాంగ మంత్రి ..
S Jaishankar: పాకిస్థాన్‌లో జరుగుతోన్న SCO సమ్మిట్‌లో పాల్గొన్న భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి చురకలు వేశారు.
S Jaishankar: పాకిస్థాన్‌లో జరుగుతోన్న SCO సమ్మిట్‌లో పాల్గొన్న భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి చురకలు వేశారు. సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రస్తావించి విమర్శలు చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నమ్మకం, సహకారం, స్నేహం లోపిస్తే పొరుగువారు దూరమవుతారని వ్యాఖ్యానించారు.
కాగా, ఈ సమావేశం అనంతరం జైశంకర్ మంత్రి ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘ఇస్లామాబాద్‌లో జరిగిన ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సులో మన దేశం వాణిని వినిపించాను. కల్లోల ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు తగిన విధంగా ఎస్‌సీఓ స్పందించాలి’ అంటూ పలు మంత్రి అంశాలను ప్రస్తావించారు. కాగా, 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై పాక్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడితో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించిన విషయం తెలిసిందే.