బీజేపీలోకి శ్రేయాసి సింగ్!
Shooter Shreyasi Singh : కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత దిగ్విజయ్ సింగ్ కూతురు శ్రేయాసి సింగ్ (29) ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీహార్ బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సంజయ్ జైస్వాల్ సమక్షంలో శ్రేయాసి సింగ్ పార్టీలో చేరనున్నారు.
Shooter Shreyasi Singh : కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత దిగ్విజయ్ సింగ్ కూతురు శ్రేయాసి సింగ్ (29) ఇవాళ బీజేపీలో చేరారు.. పార్టీ లీడర్ భూపేంద్ర యాదవ్ ఆమె పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కమలం తరఫున ఆమె పోటీలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అమర్‌పూర్ లేదా బంకాలోని జముయి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటి చేసే అవకాశం ఉంది. శ్రేయాసి రాజకీయాల్లో చేరడం గురించి గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ముందుగా ఆమె ఆర్జెడిలో చేరుతారని వార్తలు కూడా వచ్చాయి.
బీహార్‌లో 243 స్థానాలకు గాను అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీల్లో మూడు దశల్లో జరగనున్నాయి.. నవంబర్ 10 న ఫలితాలు ప్రకటించబడతాయి. కాగా శ్రేయాసి సింగ్ షూటర్‌గా భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అంతకుముందు గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించింది.
శ్రేయాసి సింగ్ తండ్రి దిగ్విజయ్ సింగ్ మాజీ ప్రధాని చంద్రశేఖర్ పదవిలో ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా కీలక పదవులను నిర్వహించారు. అంతేకాకుండా 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో రైల్వే మంత్రిత్వ శాఖగా పనిచేశారు. ఇక 1999 నుండి మరణించే వరకు ది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఐఐ) అధ్యక్షుడిగా దిగ్విజయ్ సింగ్ పనిచేశారు. ఇక అయన పుతుల్ కుమారిని వివాహం చేసుకోగా మాన్సీ సింగ్ మరియు శ్రేయాసి సింగ్ అనే కుమార్తెలు వీరికి ఉన్నారు.