బీజేపీకి బిగ్ షాక్.. ఎన్డీఏ నుంచి తప్పుకున్న శిరోమణి అకాలీదళ్

ఎన్డీఏకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వ్యవసాయ బిల్లులకు నిరసనగా శిరోమణి అకాలీదళ్ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ పదవికి రాజీనామా చేశారు..

Update: 2020-09-27 04:48 GMT

ఎన్డీఏకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వ్యవసాయ బిల్లులకు నిరసనగా శిరోమణి అకాలీదళ్ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఎన్డీఏ నుంచి కూడా శిరోమణి అకాలీదళ్ వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం అనంతరం ఈ నిర్ణయానికి వచ్చింది.  పార్టీ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో 22 సంవత్సరాల అనుబంధం తెగిపోనుంది. ఇటీవల మోడీ ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లును దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్న వివిధ రాజకీయ పార్టీలు.. ఈ సమస్యను దేశవ్యాప్తంగా లేవనెత్తాయి. ఈ బిల్లులను మొదట శిరోమణి అకాలీదళ్ లేవనెత్తింది.

పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ పార్టీకి గట్టి పునాదులు ఉన్నాయి. ప్రస్తుతం పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పంజాబ్ రాజకీయాల్లో వ్యవసాయం, రైతులు ముఖ్యమైనవి. కాబట్టి ఏ పార్టీ కూడా దీనిని విస్మరించే సాహసం చేయదు. 2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ ప్రకటించింది. దాని ఫలితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న అకాలీదళ్ కాంగ్రెస్ ప్రకటన కారణంగా పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఈ క్రమంలో

కొత్తగా వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కారణంగా తమ పార్టీకి కూడా రైతుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించి ఎన్డీఏ నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. కాగా పంజాబ్ లో మరో ఒకటిన్నర సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. అందువల్ల ఎన్డీయేను విడిచిపెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది.

Tags:    

Similar News