Shirdi: బాబా భక్తులకు అలెర్ట్.. మే 1 నుంచి షిర్డీ బంద్..!

Shirdi: దేశంలో ప్రముఖ ఆలయాల్లో షిర్డీ ఒకటి. షిర్డీలోని ఆ సాయినాధుడిని దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివెళ్తుంటారు.

Update: 2023-04-28 06:47 GMT

Shirdi: బాబా భక్తులకు అలెర్ట్.. మే 1 నుంచి షిర్డీ బంద్..!

Shirdi: దేశంలో ప్రముఖ ఆలయాల్లో షిర్డీ ఒకటి. షిర్డీలోని ఆ సాయినాధుడిని దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివెళ్తుంటారు. వేసవి కాలంలో అయితే రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే సాయిబాబా ఆలయం భద్రత విషయమై సాయి సంస్థాన్ ట్రస్ట్, షిర్డీ గ్రామస్తుల మధ్య వివాదం చెలరేగుతోంది. ఈ క్రమంలోనే మే 1 నుంచి గ్రామస్తులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.

వివాదానికి కారణం:

షిర్డీలోని సాయిబాబా ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని నిఘా వర్గాలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సామాజికవేత్త సంజయ్ కాలే ఆలయ భద్రతపై బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ఔరంగాబాద్ బెంచ్..భద్రత విషయమై సాయి సంస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా సీఐఎస్ ఎఫ్ భద్రతకు అంగీకారం తెలిపాయి. అయితే ఇక్కడే వివాదం రాజుకుంది.

సాయిబాబా ఆలయానికి సీఐఎస్ ఎఫ్ భద్రత కల్పించడంపై స్థానికులు తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నారు. ప్రస్తుతం ఉన్నట్లుగా ఆలయ భద్రతను సాయి సంస్థాన్ సిబ్బంది పర్యవేక్షించాలని, ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకోవాలని షిర్డీ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, సీఐఎస్ ఎఫ్ ఎంట్రీ ఇస్తే ఆంక్షలు ఎక్కువగా ఉంటాయని..దీంతో అటు భక్తులకు ఇబ్బందులతో పాటు తమ ఉపాధి అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక వ్యాపారులు, సంఘాలవారు సమావేశం నిర్వహించి గ్రామంలో బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే షిర్డీలో మే1 నుంచి నిరవధిక బంద్ అమలు కానుంది. సీఐఎస్ ఎఫ్ భద్రత పై కోర్టులో సవాలు చేసేందుకు సైతం గ్రామస్థులు రెడీ అయ్యారు.

షిర్డీ గ్రామస్తుల డిమాండ్లు:

సాయిబాబా ఆలయానికి సీఐఎస్ ఎఫ్ భ్రదత వద్దంటున్న గ్రామస్తులు ప్రధానంగా పలు డిమాండ్లను తెరపైకి తెచ్చారు. సాయిబాబా సంస్థాన్ ప్రధాన ఈవో పోస్టును రద్దు చేసి ఆ స్థానంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఒక కమిటీని వేయాలని కోరుతున్నారు. ఈ కమిటీలో తహసీల్దార్ తో పాటు ప్రాంతీయ అధికారి కూడా ఉండాలని అంటున్నారు. ఇకపోతే సాయిబాబా సంస్థాన్ ను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే కొత్తగా ట్రస్టీ బోర్డును ఏర్పాటు చేయాలని అందులో 50 శాతం ధర్మకర్తలు షిర్డీ నుంచే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

బంద్ ఉన్న దర్శనం యథావిధిగానే

మే 1 నుంచి షిర్డీలో వ్యాపారస్తులు బంద్ పాటిస్తున్నప్పటికీ భక్తుల కోసం సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుంది. ఈ మేరకు సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. సాయిబాబా సంస్థాన్ లో భక్తుల బస, ప్రసాదాలయం, క్యాంటీన్ యథావిధిగానే పనిచేస్తాయని తెలిపింది.

Tags:    

Similar News