Aadhaar: సోషల్ మీడియాలో ఆధార్‌ నెంబర్‌ షేర్ చేయడం చాలా ప్రమాదకరం.. ఎందుకంటే..?

* సుప్రీంకోర్టు ఆధార్ తప్పనిసరికాదని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిని అన్నిటితో ముడిపెడుతుంది.

Update: 2021-11-14 04:17 GMT

సోషల్ మీడియాలో ఆధార్‌ నెంబర్‌ షేర్ చేయడం చాలా ప్రమాదకరం(ఫైల్ ఫోటో)

Aadhaar: ఇండియాలో గుర్తింపుకు చాలా పత్రాలు ఉన్నాయి. అందులో ఆధార్‌, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డ్ ఇలా చాలా ఉన్నాయి. కానీ వీటన్నింటిలో ఆధార్‌ చాలా ప్రభావవంతమైనది. సుప్రీంకోర్టు ఆధార్ తప్పనిసరికాదని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిని అన్నిటితో ముడిపెడుతుంది.

ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులకు ఆధార్ అవసరం. ఇది లేకుంటే మన ముఖ్యమైన పనులు అసంపూర్ణంగా ఉంటాయి. బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, కొత్త మొబైల్ నంబర్ తీసుకోవాలన్నా దాదాపు అన్ని చోట్లా ఆధార్ కార్డు అవసరం.

ఆధార్ కార్డ్‌లో మన పేరు, తండ్రి పేరు, ఇంటి చిరునామా మాత్రమే కాకుండా మన వివరాలు కూడా ఉంటాయి. అందుకే ఇది పవర్‌ ఫుల్‌ గుర్తింపు కార్డని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్‌లో ఉన్న యూనిక్ ఐడీ నంబర్ చాలా సింపుల్‌గా ఉంటుంది. అందుకే ఇది ఎవ్వరికి అర్థం కాదు.

సాధారణంగా ఆధార్ నంబర్‌తో ఎటువంటి మోసం ఉండదు కానీ ప్రస్తుత కాలంలో ఎవ్వరినీ నమ్మలేం. మీ రహస్య సమాచారం అంతా ఆధార్‌లోని ప్రత్యేక ID నంబర్‌లో ఉంటుంది. మీ పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఇంటి చిరునామా, భౌతిక గుర్తింపు మొదలైనవాటిని ఆధార్ నంబర్ ద్వారా గుర్తించవచ్చు. అందుకే ఆధాన్‌ నెంబర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు.

UIDAI ఏమి సూచిస్తుంది. పాన్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ చెక్ లాంటివి అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పత్రాలపై నమోదు చేసిన నంబర్లను ఏ విధంగానూ పబ్లిక్ చేయలేరు.

అదేవిధంగా ఆధార్‌ను కూడా అవసరానికి మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల మీ రహస్య సమాచారం భద్రంగా ఉంటుంది. ప్రతిచోట ఆధార్‌ ఉపయోగిస్తే నంబర్ పబ్లిక్‌ అవుతుంది. అలాంటప్పుడు మీపై కోపం ఉన్నవారు లేదా ఇంకా ఎవరైనా కావాలని దుర్వినియోగం చేయవచ్చు.

Tags:    

Similar News