Shabnam Case: తల్లికి క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతిని వేడుకున్న షబ్నమ్ కొడుకు
Shabnam Case: దేశంలోనే తొలిసారి ఓ మహిళ ఉరినున్న సంగతి తెలిసిందే.
దేశంలోనే తొలిసారి ఓ మహిళ ఉరినున్న సంగతి తెలిసిందే. ప్రియుడితో కలిసి కుటుంబ సభ్యులను కిరాతకంగా హత్య చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షబ్నమ్‌ను ఉరితీసేందకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షబ్నమ్ కొడుకు తన తల్లిని ఉరి తీయ్యొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థించాడు. ఈ మేరకు రాష్ట్రపతికి ఎదుట క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు.
షబ్నమ్ కొడుకు నేపథ్యంలో మహ్మద్ తాజ్ రామ్‌పుర్ జైలులో తన తల్లిని కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడు తీవ్ర ఆవేదను లోనైయ్యాడు. ఇప్పటికే గవర్నర్ అనందిబెన్ పటేల్ షబ్నమ్ కేసుకు సంబంధించిన క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించారు. దీంతో ఆమెను ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు సిద్ధంగా ఉన్నారు. నిర్భయ కేసులో నిందితులను ఉరి తీసిన పవన్ జల్లాదేనే షబ్నమ్‌నూ కూడా ఉరి తీసే అవకాశం ఉంది.
మహ్మద్ తాజ్ షబ్నమ్‌న(shabnam)కు కన్నకొడుకే.. ప్రియుడితో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. కుటుంబసభ్యులను అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి చంపింది. అప్పటికే మహ్మద్ తాజ్ ఆమె కడుపులో ఉన్నాడు. షబ్నమ్ జైలులోనే బిడ్డకు జన్మనిచ్చింది. జైలు రూల్స్ ప్రకారం 6 సంతత్సరాలు వచ్చిన తర్వాత పిల్లవాడు కారాగారం పరిసరాల్లో ఉండకూడదు. దీంతో ఆమె స్నేహితుడు ఉస్మాన్ సైఫీని కొడుకును అప్పగించింది. షబ్నమ్ తన కన్నవాళ్లతో సహా అందరికి హత్య చేస్తే.. కన్నతల్లి షబ్నమ్ ని కాపాడుకోవడానికి తాజ్ పరితపిస్తున్నాడు.