వామ్మో.. ఆత్మహత్య చేసుకున్నా సిగపట్లు వదలల్లేదు.. శవం కోసం ఏడుగురు భార్యల ఫైటింగ్!

Update: 2019-10-03 10:30 GMT

ఒక్క భార్యతోనే వేగాలేకపోతున్నమంటారు. చట్ట రీత్యా బహుభార్యత్వం నేరం కూడాను. కానీ, ఒక లారీ డ్రైవర్ ఏకంగా ఎదుగుర్ని పెళ్లి చేసుకుని కాపురం కూడా చేసేశాడు. మరి వీళ్ళందర్నీ పోషించాలంటే చాలా కష్టం కదా. ఆ క్రమంలో అప్పుల పాలయ్యాడో.. లేక ఏడుగురి గోల భరించలేక పోయాడో కానీ, జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటివరకూ..దొంగతనంగా సాగిన భార్యల భాగోతం అతని శవం సాక్షిగా వీధికెక్కింది. ఏడుగురు భార్యలు ఆ పీనుగ నాదంటే నాదని రోడ్డున పడి కొట్టుకున్నారు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. 

ఉత్తరఖాండ్‌లోని హరిద్వార్‌లో ఏడుగురు భార్యలు తమ భర్త మృతదేహం కోసం వాదులాడుకుంటున్నారు. వివరాలు.. హరిద్వార్‌, రిషికూల్‌ ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ అనే లారీ డ్రైవర్‌ ఆదివారం రాత్రి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన అతడి భార్య స్థానికులు సాయంతో సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ సదరు లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. అతడితో పాటు వచ్చిన మహిళ ముందుగానే భార్యను అని చెప్పుకుంది. అంతలో మరో ఆరుగురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. 'మా ఆయన అంటే మా ఆయన' అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. డెడ్ బాడీని తమకంటే తమకు అప్పగించాలంటూ గొడవకు దిగారు. అక్కడున్న వారికి ఏమీ అర్థంకాక అలా చూస్తుండిపోయారు. ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటున్న వారు.. పోలీసుల ఎంట్రీతో కాస్త తగ్గారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు మహిళలను ఒక్కొక్కరిని పిలిచి విచారించగా వారంతా సదరు లారీ డ్రైవర్‌కు భార్యనని తెలిపారు. దాంతో పోలీసులు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ చూపించాల్సిందిగా కోరారు. తమ దగ్గర అలాంటివి ఏం లేవన్నారు. అంతేకాక అంత్యక్రియలు నిర్వహించడం కోసం మృత దేహాన్ని తమకు అప్పగించమంటూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. చివరికి పోలీసులు వారందరికీ కౌన్సెలింగ్క చేసి.. కలిసి చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా సూచించారు. అందుకు ఆ మహిళలు కూడా అంగీకరించిడంతో.. పోలీసులు లారీ డ్రైవర్‌ మృతదేహాన్ని వారికి అప్పగించారు. దాంతో సమస్య పరిష్కారమయ్యింది. ఆర్థిక సమస్యలతో పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అతడి బ్యాంక్ ఆకౌంట్ లో బ్యాలెన్స్ లేదని వివరించారు.

Tags:    

Similar News