Indian Railway: ఈ ట్రైన్‌లో నాన్‌వెజ్‌ తినలేరు.. ఎందుకో తెలుసా..?

Indian Railway:ఈ ట్రైన్‌లో నాన్‌వెజ్‌ తినలేరు.. ఎందుకో తెలుసా..?

Update: 2022-08-05 04:30 GMT

Indian Railway:ఈ ట్రైన్‌లో నాన్‌వెజ్‌ తినలేరు.. ఎందుకో తెలుసా..?

Indian Railway: రైలులో ఆహారానికి సంబంధించి రైల్వే శాఖ పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వందే భారత్ రైలులో నాన్ వెజ్ తినడం నిషేధించారు. దీనిని దేశంలోనే సాత్విక్ సర్టిఫికేట్ (శాకాహార రైలు) పొందిన మొదటి రైలుగా గుర్తించారు. అంటే ఈ రైలులో కేవలం శాఖాహారం మాత్రమే తినాలి. ప్రయాణీకులు వారివైపు నుంచి కూడా నాన్‌వెజ్ ఆహార పదార్థాలు తీసుకురాకూడదు.

IRCTC వందే భారత్‌ను సాత్విక రైలుగా మార్చడం ప్రారంభించింది. రైల్వే శాఖ ప్రకారం, క్రమంగా మతపరమైన ప్రదేశాలకు వెళ్లే ఇతర రైళ్లను కూడా సాత్వికంగా మారుస్తారు. వాస్తవానికి ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు పూర్తిగా శాకాహారం తినడానికే ఇష్టపడుతారు. దీని తర్వాత మిగిలిన మత ప్రదేశాలకి వెళ్లే రైళ్లని కూడా సాత్వికంగా మార్చే పనిలో ఉన్నారు. వాస్తవానికి ప్రయాణ సమయంలో చాలా మంది రైళ్లలో వడ్డించే ఆహారాన్ని ఇష్టపడరు. ఎందుకంటే రైలులో లభించే ఆహారంపై పలు అనుమానాలు ఉంటాయి.

ఇప్పుడు అలాంటి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు భారతీయ రైల్వే సాత్విక్ రైలును ప్రారంభించింది. వందేభారత్ రైలుకు సాత్విక్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ముందు అనేక ప్రక్రియలు పూర్తయ్యాయని సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు అభిషేక్ బిస్వాస్ తెలిపారు. ఇందులోభాగంగా వంట చేసే విధానం, కిచెన్‌, సర్వింగ్‌, సర్వింగ్‌ పాత్రలు, మెయింటెనెన్స్‌ తదితర అంశాలను పరిశీలించి అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాతే సర్టిఫికెట్‌ ఇచ్చారు. అంటే పూర్తి ప్రిపరేషన్ తర్వాత మాత్రమే రైల్వే ఈ సర్టిఫికెట్ ఇచ్చింది.

Tags:    

Similar News