Parliament: లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. విజటర్స్ గ్యాలరీ నుంచి దూకిన ఆగంతుకులు
Parliament: వెంటనే సభను వాయిదా వేసిన ప్యానెల్ స్పీకర్
Parliament: పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది. లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు. సభలో గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు. ఈ గందరగోళంతో ఎంపీలు భయపడి పరుగులు తీశారు. నల్ల చట్టాలను బంద్ చేయాలని దుండుగులు నినాదాలు చేశారు. కొందరు ఎంపీలు దుండగులను పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. లోక్ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుండగులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ్యుల మధ్యలోకి దూకి స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు. దీంతో ప్యానెల్ స్పీకర్ వెంటనే సభను వాయిదా వేశారు.
లోక్‌సభలో ఆగంతకులను పట్టుకుని భద్రతా సిబ్బంది బయటకు తీసుకురాగా.. పార్లమెంట్ బయట కూడా నినాదాలు చేశారు నిందితులు. అక్కడ కూడా గ్యాస్ వదిలి హంగామా చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 2001లో సరిగ్గా ఇదే రోజు పార్లమెంట్‌పై దాడి జరిగింది. ఆ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవాళ లోక్‌సభలో చొరబడడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.