UN Secretary General: ఐక్యరాజ్య సమితి చీఫ్‌గా ఆంటోనియా గుటెరస్
UN Secretary General: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియా గుటెరస్ వరుసగా రెండోసారి నియమితులయ్యారు
UN Secretary General: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పోర్చుగీసుకు చెందిన ఆంటోనియా గుటెరస్ వరుసగా రెండోసారి నియమితులయ్యారు. యూఎన్ చీఫ్‌గా మళ్లీ గుటెరస్ ఎన్నికైనట్లు శుక్రవారం ప్రకటించారు. జనవరి 1, 2022 నుంచి మరో ఐదేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఆంటోనియా గుటెరస్‌కే అవకాశం ఇవ్వాలని ఇటీవల జరిగిన సమావేశంలో 15 దేశాల భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. తాజాగా 193 మంది సభ్యులున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సైతం గుటెరెస్‌ను మరోసారి సెక్రటరీ జనరల్‌గా నియమించాలని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు సర్వ ప్రతినిధి సభ అధ్యక్షుడు వోల్కన్ బోజ్కర్ శుక్రవారం గుటెరస్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఐరాస సెక్రెటరీ జనరల్ పదవిలో గుటెర్రస్ 2026 డిసెంబరు 31 వరకు కొనసాగుతారు. ఐరాస సెక్రటరీ జనరల్‌గా గుటెరస్ తొలిసారి 2017 జనవరి 1న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని చేపట్టిన తొమ్మిదో వ్యక్తిగా గుటెరస్ నిలిచారు. అయితే.. పోర్చుగీస్‌కు చెందిన 72 ఏళ్ల ఆంటోనియో గుటెర్రస్ ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్‌గా 2005 నుంచి 2015 వరకు పనిచేశారు.