Third Wave: సెకండ్ వేవ్ లానే థర్డ్ వేవ్ ఉద్ధృతి...ఎస్బీఐ నివేదిక
Third Wave: వ్యాక్సినేషన్,ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం వల్ల కోవిడ్ మరాణాల సంఖ్యను తగ్గించవ్చని ఎస్బీఐ తెలిపింది.
Third Wave: త్వరలో థర్డ్ వేవ్ రాబోతుందని, అది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కొన్ని ప్రాంతాల్లో ఆ ఆనవాళ్లు కనపడినట్లు కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. పెను ఉప్పెన లా విరుచుకుపడిన కరోనా సెకండ్ వేవ్ నుండి కొంత ఉపశమనం లభిస్తోంది అనుకునే లోపే థర్డ్ వేవ్ కలవరపెడుతోంది. అదే అంశాల్ని ఎస్ బీఐ తన నివేదికలో వెల్లడించింది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం వల్ల కోవిడ్ మరాణాల సంఖ్యను తగ్గించవ్చని ఆ నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా రెండో దశ సగటుగా 108 రోజులు ఉండనుందని, మూడో దశ 98 రోజులు ఉంటుందని ఎస్ బీఐ 5పేజీల రిపోర్టులో వివరించింది.
వ్యాక్సినేషన్ లో వేగం పెంచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం వల్ల భారత్ లో థర్డ్ వేవ్ లో సీరియస్ కేసులను 20 నుంచి 5శాతానికి తగ్గించవచ్చని కూడా తెలిపింది. రెండో వేవ్ లో మరణాల సంఖ్య1.7లక్షలు దాటింది. మౌలిక సదుపాయాలను పెంచడం వల్ల మరణాల సంఖ్యను 40 వేలకే పరిమితం చేయొచ్చని నివేదిక తెలిపింది. కోవిడ్ మూడో దశ పిల్లలపైనే అధిక ప్రభావం చూపనుందని హెచ్చరిస్తూ... వ్యాక్సిన్ తోనే వారు సేఫ్ జోన్ లోకి వెళతారని స్పష్టం చేసింది.