SBI: కరోనా 'కవాచ్ పర్సనల్ లోన్'.. పూచీకత్తు, 3 నెలల ఈఎంఐ లేదు!
SBI: కోవిడ్ కారణంగా ఆర్థికంగా నలిగిపోతున్న వారిని ఆదుకునేందుకు ఎస్‌బీఐ 'కవాచ్ పర్సనల్ లోన్' అందిస్తోంది.
SBI: ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త అందించింది. కోవిడ్ కారణంగా ఆర్థిక ఒత్తిడితో నలిగిపోతున్న మధ్య తరగతిని ఆదుకునేందుకు ఎస్‌బీఐ 'కవాచ్ పర్సనల్ లోన్' పేరుతో రుణాన్ని అందిస్తోంది. దీనికి ఎటువంటి పూచీకత్తు అవసరం లేదని వెల్లడించింది. కోవిడ్-19 చికిత్స కోసం ఖాతాదారులకు ఎస్‌బీఐ 8.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో ఈ లోన్ ను అందిచనుంది.
ఈ లోన్ కింద రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాన్ని ఖాతాదారులకు అందించనుంది. ఏడాదికి 8.5% వడ్డీ రేటుతో ఎవరైనా ఈ లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ ను చెల్లించేందుకు గరిష్ఠ గడువు 60 నెలలు. అలాగే లోన్ తీసుకున్న వారు మూడు నెలలు ఈఎమ్ఐ కూడా కట్టాల్సిన పనిలేదని ఎస్‌బీఐ తెలిపింది. అలాగే ఈ లోన్ కు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదని పేర్కొంది.