SBI కస్టమర్లకు శుభవార్త.. ఉచితంగా 2 లక్షల ప్రయోజనం..

*బీమా ప్రయోజనాన్ని పొందడానికి కస్టమర్లు SBIలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాని తెరవాలి.

Update: 2021-11-19 03:58 GMT

SBI కస్టమర్లకు శుభవార్త(ఫైల్ ఫోటో)

SBI Customers: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాని కలిగి ఉన్న ఖాతాదారులకు రూ.2 లక్షల ఉచిత బీమా ప్రయోజనాన్ని అందిస్తోంది. బీమా ప్రయోజనాన్ని పొందడానికి కస్టమర్లు SBIలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాని తెరవాలి. ఆగస్టు 28, 2018లోపు తమ SBI ఖాతాలను తెరిచిన ప్రస్తుత కస్టమర్‌లు కూడా ఈ ప్రయోజనం పొందేందుకు అర్హులు.

SBI రూపే జన్ ధన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వినియోగదారులకు ఈ పథకం అందుబాటులో ఉంది. ప్రమాద బీమా ప్రయోజనాన్ని పొందాలంటే నామినీలు క్లెయిమ్ ఫారమ్‌ను పూరించాలి. చనిపోయిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రాన్ని జతచేయాలి. ప్రమాదానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు మృతుల మరణ నివేదిక, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు, ఆధార్‌ కార్డు కాపీని కూడా సమర్పించాల్సి ఉంటుంది.

ప్రమాదం జరిగిన 90 రోజులలోపు బీమా క్లెయిమ్ చేసుకోవడానికి ఈ పత్రాలను సమర్పించాలి. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అనేది 2014లో మోడీ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఈ పథకం ఉద్దేశ్యం ప్రాథమిక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా అందరికి ఉండటం, రుణాల యాక్సెస్, చెల్లింపు సౌకర్యం, బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలకు బీమా, పెన్షన్ మొదలైన సేవల కోసం.

ఇది కాకుండా లబ్ధిదారులు రూపే డెబిట్ కార్డుతో పాటు రూ.1 లక్ష ఇన్‌బిల్ట్ ప్రమాద బీమా కవరేజీని కూడా పొందుతారు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు అన్ని ప్రభుత్వ ప్రయోజనాలను లబ్ధిదారుల జన్‌ ధన్‌ ఖాతాలకు బదిలీ చేస్తారు. దేశంలోని ప్రతి ఒక్కరికి ఖాతా ఉండాలనేది ఈ స్కీం ముఖ్య ఉద్దేశ్యం. అందుకే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

Tags:    

Similar News