Tamilnadu: శ‌శిక‌ళ కీలక నిర్ణ‌యం.. మ‌ళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి..?

Update: 2021-05-30 10:16 GMT

Sasikala ( Thehansindia)

Tamilnadu: అన్నాడిఎంకే బహిష్కృత నేత శశికళ మళ్లీ ప్ర‌త్య‌క్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ద‌మైంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే ఓట‌మి పాలైంది. ఈ నేప‌థ్యంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు శశికళ ప్రకటించారు. అన్నాడీఎంకే అధినేత, మాజీ సీఎం జ‌య‌ల‌లిత‌ మరణం తర్వాత పార్టీ తీవ్ర ఒడిదొడుకులకు గురైన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకే పార్టీ జనరల్‌ సెక్రటరీగా శశికళ నియమితులయ్యారు. అయితే, 2017లో అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2017 సెప్టెంబర్‌లో శశికళతో పాటు ఆమె అల్లుడు దినకరన్‌ను ఏఐఏడీఎంకే పార్టీ నుంచి తొలగించింది.

జైలు నుంచి విడుదలైన శశికశ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటార‌ని ప్ర‌క‌టించారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఓటమి పాలయ్యింది. ఇదే అదునుగా భావించిన శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమౌతున్నారనే ప్రచారం మొదలయ్యింది. ఇందుకు సంబంధించి శశికళ మాట్లాడుతన్న ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పార్టీ విషయాలను తప్పకుండా చక్కబెడతాను. ధైర్యంగా ఉండండి. కరోనా ముగిసిన తర్వాత మళ్లీ నేను వస్తాను' అని శశికళ సదరు ఆడియోలో చెప్పారు. దీనికి జవాబుగా.. 'మీ వెనకే మేముంటాం అమ్మా' అని కొందరు పార్టీ కార్యకర్తలు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని టీటీవీ దినకరన్‌ వ్యక్తిగత సిబ్బంది కూడా ధ్రువీకరించారు.

Tags:    

Similar News