అన్నా డీఎంకేలో కొనసాగుతున్న అంతర్యుద్ధం.. పార్టీ పై పట్టు వీడని శశికళ

తాను పార్టీని వీడేది లేదని జీవితాంతం అన్నా డీఎంకేలోనే ఉంటాననీ ప్రకటించారు

Update: 2021-12-02 12:13 GMT

తాను పార్టీని వీడేది లేదని జీవితాంతం అన్నా డీఎంకేలోనే ఉంటాననీ శశికళ ప్రకటించారు( ఫైల్-ఫోటో )

Sasikala-AIADMK: తమిళనాడు అన్నాడీఎంకేలో లుకలుకలు ఇంకా చల్లార లేదు. పార్టీపై పట్టు కోరుకుంటున్న శశికళ ఇంకా పావులు కదుపుతూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాలనుంచి తప్పుకుంటున్నానని ప్రకటించినా పార్టీ కార్యకలాపాలపై అంతర్లీనంగా ఆమె పెత్తనం కొనసాగుతూనే ఉంది. పార్టీపై గుత్తాధి పత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శశికళ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పళని, పన్నీర్ వర్గాలు నిన్న పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. శశికళ పెత్తనం పెట్టేందుకు వీలులేకుండా పార్టీ బైలాస్ మార్చేశారు.

ఐదేళ్ల ప్రాధమిక సభ్యత్వం ఉన్న వారే పార్టీలో ఓటు వేసేందుకు అర్హులని సవరణలు చేశారు. అంతేకాదు పార్టీ కోఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్ పదవులు రెండుగా ఉన్నా వాటి ఎన్నికకు ఒక ఓటునే ప్రామాణికం చేస్తూ మార్పులు చేశారు. ఈ విధంగా శశికళ మళ్లీ అడుగు పెట్టే వీలులేకుండా చేశారు. అయితే ఈ మార్పులు జరిగిన 48 గంటలకు శశికళ స్పందించారు. తాను పార్టీని వీడేది లేదని జీవితాంతం అన్నా డీఎంకేలోనే ఉంటాననీ ప్రకటించారు. కార్యకర్తలెవరూ అధైర్య పడొద్దని, త్వరలోనే పరిస్థితులన్నీ సర్దుకుంటాయని ప్రకటన చేశారు. శశికళ తాజా ప్రకటన వెనక ఉన్న రాజకీయ వ్యూహమేంటన్నది బయటపడాల్సి ఉంది.

Tags:    

Similar News