ఆర్యన్‌ ఖాన్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేయనున్న సంజయ్ కుమార్ సింగ్

Mumbai Cruise Drugs Case: సంజయ్ కుమార్ చరిత్ర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే...

Update: 2021-11-06 06:09 GMT

ఆర్యన్‌ ఖాన్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేయనున్న సంజయ్ కుమార్ సింగ్ 

Mumbai Cruise Drugs Case: దేశంలో సంచలనం సృష్టించిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సింగ్ చరిత్ర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. సంజయ్ కుమార్ సింగ్ ఒడిశా పోలీసు విభాగం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లలో వివిధ హోదాల్లో పనిచేశారు.

గతంలో ఈయన పలు అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ ల గుట్టును రట్టు చేసి సమర్ధ అధికారిగా పేరొందారు. సమీర్ వాంఖడే నేతృత్వంలోని బృందం అక్టోబర్ 3న ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన క్రూయిజ్ డ్రగ్ కేసును ఇప్పుడు సిట్‌కు నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి సంజయ్ కుమార్ సింగ్ విచారించనున్నారు.

సంజయ్ కుమార్ సింగ్ 1996 బ్యాచ్ ఒడిశా ఐపీఎస్ క్యాడర్ అధికారి. ఎన్సీబీలో చేరడానికి ముందు సంజయ్ కుమార్ సింగ్ ఒడిశా పోలీసు డ్రగ్ టాస్క్ ఫోర్స్ కి అదనపు డైరెక్టర్ జనరల్ గా నాయకత్వం వహించారు. డీటీఎఫ్ లో ఉన్నపుడు సింగ్ ఒడిశా రాష్ట్రంలో డ్రగ్స్ వ్యతిరేక డ్రైవ్‌లను ప్రారంభించారు. భువనేశ్వర్‌లో పలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా రాకెట్‌లను ఛేదించారు. 2008లో సింగ్ సీబీఐలో డీఐజీగా 2015 వరకు పనిచేశారు.

సీబీఐలో పనిచేసిన సమయంలో ఇతను పలు హై ప్రొఫైల్ కేసులను దర్యాప్తు చేశారు. సంజయ్ కుమార్ సింగ్ ఐజీపీ గా, ఒడిశా పోలీస్ ట్విన్ సిటీ, ఒడిశా పోలీస్ అదనపు కమిషనర్‌గా కూడా పనిచేశారు. జనవరి 2021లో సంజయ్ కుమార్ సింగ్‌ను కేంద్ర ఏజెన్సీకి డిప్యూటేషన్‌పై పంపారు.

సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా చేరారు. సింగ్ పై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు లేదా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని సమర్ధ అధికారిగా గుర్తింపు పొందారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొంది.

Tags:    

Similar News