టాయిలెట్ టైల్స్ పైన పార్టీ జెండా రంగులు!

ఉత్తర ప్రదేశ్‌లోని టాయిలెట్ టైల్స్ పైన తమ పార్టీ జెండా రంగును పోలి ఉండడం పట్ల సమాజ్ వాది పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ టాయిలెట్ కు ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఎందుకు వేశారని, వీటిని వెంటనే తొలిగించాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Update: 2020-10-29 15:06 GMT

ఉత్తర ప్రదేశ్‌లోని టాయిలెట్ టైల్స్ పైన తమ పార్టీ జెండా రంగును పోలి ఉండడం పట్ల సమాజ్ వాది పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ టాయిలెట్ కు ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఎందుకు వేశారని, వీటిని వెంటనే తొలిగించాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. తమ పార్టీ జెండాను పోలి ఉన్న రంగులను వేయడం తమ పార్టీని అవమానించడమేనని పార్టీ కార్యకర్తలు అన్నారు. ఇలాంటివి తాము అస్సలు సహించబోమని, దీనికి బాధ్యులు అయినవారిని శిక్షించాలని ఫిర్యాదు చేశారు.

అయితే మూడు, నాలుగు నెలల కిందటే ఆ రంగులు వేశారని కానీ ఇప్పుడే తమ దృష్టికి వచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. ఇక దీనిపైన సమాజ్‌వాదీ పార్టీ ట్విటర్‌లో స్పందించింది. తమ పార్టీ రంగులను టాయ్‌లెట్‌ గోడలకు వేయడం కొందరు రాజకీయ నాయకుల దుర్మార్గపు చర్యగా అభివర్ణించింది.. ఒక ప్రధాన రాజకీయ పార్టీ జెండా రంగులను అవమానించడమేనని పేర్కొంది. వెంటనే ఆ రంగులను మార్చాలని డిమాండ్ చేసింది.

అంతేకాకుండా దీనికి బాధ్యులు ఎవరో తెలుసుకొని వారిపైన పై తగిన చర్యలు తీసుకోవాలని ట్విటర్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. #ShameOnYouPiyushGoyal అనే హాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని లలిత్ నారాయణ్ మిశ్రా రైల్వే ఆసుపత్రిలోని టాయిలెట్‌ టైల్స్ పైన ఆ రంగులను వేశారు.


Tags:    

Similar News