Samajwadi Party: 159 మందితో ఎస్పీ తొలి జాబితా

Samajwadi Party: కర్హల్‌ నుంచి అఖిలేష్‌ పోటీ.. ప్రస్తుతం ఆజంఘఢ్‌ నుంచి ఎంపీగా ఉన్న ఎస్పీ అధినేత

Update: 2022-01-25 02:44 GMT

 159 మందితో ఎస్పీ తొలి జాబితా

Samajwadi Party: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ బరిలో దిగారు. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలన్న ప్రతిపక్షాల నుంచి వచ్చిన సవాళ్ళ నేపథ్యంలో మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు పార్టీ నిన్న 159 మంది అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో అఖిలేశ్‌ పేరు ప్రథమంగా ఉంది.

యాదవులకు కంచుకోటగా ఉన్న కర్హల్‌ మాజీ సీఎం ములాయంసింగ్‌ యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది. 2002 ఎన్నికల్లో మినహా 1993 నుంచి కర్హల్‌లో సమాజ్‌వాదీ జెండా ఎగురుతోంది. 2017లో ఎస్పీ అభ్యర్థి సోబ్రాన్‌సింగ్‌ యాదవ్‌ 38 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. పార్టీకి బలమైన స్థానం కావడంతో అఖిలేశ్‌ సైతం ఇక్కడి నుంచే పోటీకి మొగ్గు చూపారు. 

Tags:    

Similar News