Saloons Re-Open in Mumbai: మూడు నెలల తరువాత ముంబై నగరంలో సెలూన్‌లు రీఓపెన్‌!

Saloons Re-Open in Mumbai: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ల మీదా లాక్ డౌన్ లు విధిస్తూ ముందుకు వెళ్తున్నాయి.

Update: 2020-06-28 11:24 GMT

Saloons Re-Open in Mumbai: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ల మీదా లాక్ డౌన్ లు విధిస్తూ ముందుకు వెళ్తున్నాయి. అయినప్పటికీ ఎక్కడ కూడా కరోనా ప్రభావం తగ్గడం లేదు.. పలు రాష్ట్రాల్లో అయితే రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి.. భారీగా కరోనా వైరస్ లు పెరుగుతున్న ప్రాంతాలలో ముంబై నగరం ఒకటి.. దేశ ఆర్థిక నగరం అయిన ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు..

అయితే గత మూడు నెలల తరవాత ఇక్కడ బార్బర్‌ దుకాణాలు, సెలూన్లు తిరిగి ఈ రోజు ( ఆదివారం) ప్రారంభమయ్యాయి. దీనితో గత మూడు నెలలుగా ఉపాధి లేకుండా జీవనం కొనసాగిస్తున్న అక్కడి బార్బర్లు ఊపిరి పీల్చుకున్నారు.. ప్రభుత్వం అందించిన నిబంధనల ప్రకారమే సెలూన్ షాపులను తెరుస్తున్నట్లుగా సెలూన్ యజమానులు చెబుతున్నారు.. సెలూన్‌ మొత్తాన్ని రెండు గంటలకోసారి శానిటైజ్‌ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని యజమానులు చెబుతున్నారు..

ఇక చాలా కాలం తరవాత సెలూన్ షాపులు తెరుచుకోవడంతో..పెద్ద సంఖ్యలో కస్టమర్లు వస్తున్నారని కానీ మేము కొందరికే సెలూన్‌లోకి అనుమతించి భౌతిక దూరం పాటిస్తున్నామని వారు చెబుతున్నారు.. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం అనేక వ్యాపార రంగాలతో పాటు వస్త్ర దుకాణాలు, బ్యూటీపార్లర్లు, బార్బర్‌ షాపులు, సెలూన్‌లను నేటి నుంచి అనుమతి ఇచ్చింది.

ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు విషయానికి వస్తే...శనివారం సాయంత్రం నాటికి అక్కడ కొత్తగా 5,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,59,133 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది..

ఇక అటు దేశవ్యాప్తంగా కూడా కరోనా ఉధృతి పెరిగిపోతుంది. రికార్డుస్థాయిలో రోజురోజుకీ కొత్త కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల్లో 19,906 కేసులు నమోదు కావడంతో దేశంలో కేసుల సంఖ్య 5,28,859 దాటేయగా.. మరణాల సంఖ్య 16,095కు చేరాయి. నిన్న ఒక్క రోజే 410 మంది కరోనాతో మరణించారు.


Tags:    

Similar News