Salman Khan: రూ. 5 కోట్లివ్వాలి, లేదా క్షమాపణ చెప్పాలి.. సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు..
Salman Khan: సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ముంబై పోలీసులు ధృవీకరించారు.
Salman Khan: సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ముంబై పోలీసులు ధృవీకరించారు. ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు మేసేజ్ వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఈ బెదిరింపులు వచ్చాయి. ఐదు కోట్లు ఇవ్వాలి లేదా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆ మేసేజ్ లో కోరారు. ఈ వారంలో ఈ బెదిరింపు రెండోది.
సల్మాన్ ఖాన్ కు పంపిన బెదిరింపు మేసేజ్ లో ఏముంది?
తమ దేవాలయానికి వెళ్లి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేదా రూ. 5 కోట్లు ఇవ్వాలని ఆ మేసేజ్ లో ఉంది. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిని మాట్లాడుతున్నానని చెప్పారు. తమ డిమాండ్ ను పట్టించుకోకపోతే సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామని దుండగులు వార్నింగ్ ఇచ్చారని ముంబై పోలీసులు చెప్పారు. తమ గ్యాంగ్ ఇంకా యాక్టివ్ గానే ఉందన్నారు.
బెదిరింపులకు పాల్పడిన వారి కోసం పోలీసుల గాలింపు
ఈ మేసేజ్ పంపిన వారు ఎవరనే విషయమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 30న బెదిరింపులు వచ్చాయి. రెండు కోట్లు ఇవ్వాలని ఆ బెదిరింపులో కోరారు. గత నెల 12న ముంబైలో మాజీ మంత్రి బాబా సిద్దిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది. సల్మాన్ ఖాన్ తో సన్నిహితంగా ఉన్నందునే ఆయనను హత్య చేసినట్టుగా నిందితులు సోషల్ మీడియాలో ప్రకటించారు.