Kerala: భారీ వర్షాల వల్ల శబరిమలకు భక్తుల రాక నిలిపివేత

*పంబా నదికి భారీగా వరద ఉధృతి *పూర్తిగా నిండిన కల్కి - ఆంథోడ్ రిజర్వాయర్

Update: 2021-11-20 04:07 GMT

భారీ వర్షాల వల్ల శబరిమలకు భక్తుల రాక నిలిపివేత(ఫైల్ ఫోటో)

Kerala: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కేరళలోనూ భారీ వర్షాలు కురవడంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

భారీ వర్షాల వల్ల పంబా సహా ప్రధాన నదుల్లో నీటిమట్టం పెరగడంతో శబరిమల అయ్యప్ప దర్శనాలను శనివారం ఒకరోజు నిలిపివేస్తున్నట్టు పథనంతిట్టా జిల్లా అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది.

కక్కి-అనథోడే అనాతోడ్ రిజర్వాయరు వద్ద రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు పంబా నదిలో వరదలు వెల్లువెత్తుతుండటంతో డ్యామ్ వద్ద రెడ్ అలర్ట్ జారీ చేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా పంబ, శబరిమలలో భక్తుల రాకను నిలిపివేస్తున్నట్టు జిల్లా కలెక్టరు దివ్య ఎస్ అయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.

వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా స్లాట్‌ను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత సమీప స్లాట్‌లో దర్శన అవకాశం కల్పిస్తామని చెప్పారు.

Tags:    

Similar News