Sabarimala Specail Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్..ప్రత్యేకంగా 28 రైళ్లు ఏర్పాటు

Update: 2024-12-05 12:59 GMT

Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు..

Sabarimala Specail Trains: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. శబరిమల భక్తుల కోసం ప్రత్యేకంగా 28 రైళ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తుల రద్దీని పరిగణలోనికి తీసుకుని తాజాగా మరో 28 రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని మౌలాలి నుంచి కొల్లం, కాచిగూడ నుంచి కొట్టాయం, కాకినాడ టౌన్ నుంచి కొల్లం, నర్సాపూర్ నుంచి కొల్లం వరకు ఈ రైళ్లను నడపనున్నారు.

డిసెంబర్ 11వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో ఈ రైళ్ల సర్వీసులు అందించనున్నాయి. ఈ రైళ్లకు అడ్వాన్సు బుకింక్స్ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. రైళ్ల నెంబర్లు, తేదీలు, సమయం తదితర వివరాలు ఇక్కడ ఉన్నాయి.  




 


Tags:    

Similar News