Sabarimala: ఈనెల 15న తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం
* రెండు నెలల పాటు భక్తులకు స్వామివారి దర్శనం * మకరవిళక్కు పండుగ సందర్భంగా రోజుకు 30 వేల మందికి అనుమతి
Sabarimala: ఈనెల 15 నుంచి శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకోనుంది. 16వ తేదీ నుంచి భక్తులకు అనుమతి ఇస్తన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రెండు నెలల పాటు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.
మండల మకర విళక్కు పండుగ సందర్భంగా రోజుకు 30 వేల మందిని అనుమతించనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 26న మండల పూజ ముగియనుంది. మకర విళక్కు కోసం డిసెంబర్ 30న ఆలయాన్ని తెరువనున్నారు.
వచ్చే ఏడాది జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుందని.. అదే నెల 20న ఆలయాన్ని మూసి వేస్తామని చెప్పారు. కరోనా నిబంధనలకు అనుణగుంగా భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు. టీకా దృవపత్రం లేదా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరని తెలిపారు.