ఆల్‌టైం రికార్డుకు పతనమైన రూపాయి విలువ.. 7 శాతానికి క్షీణించిన రూపాయి విలువ

*డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.80.05

Update: 2022-07-19 05:15 GMT

ఆల్‌టైం రికార్డుకు పతనమైన రూపాయి విలువ.. 7 శాతానికి క్షీణించిన రూపాయి విలువ

Indian Rupee: డాలర్ తో పోల్చితే, రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. ఆల్‌టైం రికార్డుకు స్థాయికి రూపాయి విలువ పతనమైంది. జనవరి నుంచి ఇప్పటి వరకు రూపాయి 7 శాతానికి క్షీణించింది. ఇంట్రాడే స్పాట్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం రేటు తొలిసారిగా 80కి చేరింది. చివరికి 16 పైసల నష్టంతో 79.98 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కె ట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరగడంతో పాటు దేశీయ ఈక్విటీల్లోంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం ఇందుకు కారణమని తెలుస్తోంది. గత శుక్రవారం డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు 80 సమీప స్థాయి నుంచి 17 పైసలు బలపడి 79.82 వద్ద ముగిసింది.

అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమీక్ష స్టేట్‌మెంట్‌ వచ్చే వారంలో విడుదల కానున్న నేపథ్యంలో.. మార్కెట్‌ వర్గాలు ముందుజాగ్రత్త ధోరణితో వ్యవహరించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి విలువ 7 శాతానికి పైగా పతనమైంది. సెప్టెంబరు చివరికల్లా డాలర్‌-రూపాయి ఎక్స్ఛేంజ్‌ రేటు 82కు చేరుకోవచ్చని మార్గెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రూపాయి విలువ బక్క చిక్కుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతోంది. ఇప్పుడు ఏకంగా 80 రూపాయిలు దాటింది. 2014 డిసెంబర్‌ 31 నాటికి రూపాయి విలువ 63.33గా ఉండగా.. 2022 జులై 11 నాటికి అది 79.41కి చేరింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ గణాంకాలే చెబుతున్నాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చాలా కారణాలున్నాయి. కరోనా కారణంగా ఎకానమీ మందగించిన తర్వాత.. రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. పశ్చిమ దేశాలు, రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. చాలా దేశాలు, రష్యా నుంచి క్రూడాయిల్ కొనడం ఆపేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇది అమెరికా, యూరప్‌లను కూడా ప్రభావితం చేసింది.

Full View


Tags:    

Similar News