Pegasus: పెగాసస్ పై మళ్లీ అట్టుడికిన రాజ్యసభ

Pegasus: రాజ్యసభ ఇవాళ అత్యంత అభ్యంతరకర, షాకింగ్ పరిణామాలకు వేదికైంది.

Update: 2021-08-10 15:00 GMT

Pegasus: పెగాసస్ పై మళ్లీ అట్టుడికిన రాజ్యసభ

Pegasus: రాజ్యసభ ఇవాళ అత్యంత అభ్యంతరకర, షాకింగ్ పరిణామాలకు వేదికైంది. పెగాసస్ పై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు రాజ్యసభలో ఇవాళ వీరంగం వేశాయి. సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం కలిగించాయి. అదీ మామూలుగా కాదు బల్లలు ఎక్కి, పెద్దగా అరుస్తూ చప్పట్లు చరుస్తూ విపక్ష నేతలు నానా హంగామా చేశారు.

సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇవే తరహా సీన్లు రిపీట్ అయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ రూల్ బుక్ ను ఛైర్మన్ పైకి విసిరేశారు. అంతేకాదు పేపర్లు విసిరి కొట్టారు ఒకరు నినాదాలు చేస్తుంటే మరికొందరు వంత పాడారు. చప్పట్లు కొడుతూ చాలా సేపు గలభా సృష్టించారు. విపక్షాలు ఎంతకూ దారికి రాకపోవడంతో ఛైర్మన్ సభను వాయిదా వేశారు. రాజ్యసభ పరిణామాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. చట్టాలను రూపొందించే సభలో హుందాగా మెలగాల్సిన సభ్యులు వీధి రౌడీల్లా ప్రవర్తించారని విమర్శించింది. దేశం, సమాజం, ప్రపంచం చూస్తుందన్న స్పృహేనా లేకుండా పరమ దిగజారుడుగా ప్రవర్తించారంటూ మండి పడింది.

Tags:    

Similar News