West Bengal: భవానీపూర్‌‌లో పొలిటికల్ రణరంగం

West Bengal: వెస్ట్ బెంగాల్‌లో పొలిటికల్ రణరంగం మొదలైపోయింది.

Update: 2021-09-27 14:41 GMT

West Bengal: భవానీపూర్‌‌లో పొలిటికల్ రణరంగం

West Bengal: వెస్ట్ బెంగాల్‌లో పొలిటికల్ రణరంగం మొదలైపోయింది. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం రోజురోజుకూ హాట్‌టాపిక్ అవుతోంది. ఈ ఉప ఎన్నిక ప్రచారం తుదిదశకు చేరడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇవాళ ప్రచారానికి చివరి రోజు కావడంతో అధికార టీఎంసీ, బీజేపీల మధ్య రచ్చ పీక్స్‌కు చేరింది. బీజేపీ నేత దిలీప్ ఘోష్ ప్రచారాన్ని టీఎంసీ కార్యకర్తలు అడ్డుకోవడమే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్యా తోపులాట, ఘర్షణలు జరిగాయి.

ఇదే సమయంలో దిలీప్ ఘోష్ భద్రతా సిబ్బందిని టీఎంసీ కార్యకర్తలు నెట్టేశారు. ఈ సందర్భంగా దిలీప్ భద్రతా సిబ్బంది తుపాకులు తీసి టీఎంసీ కార్యకర్తలను బెదిరించేందుకు యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దిలీప్ తన ప్రచారాన్ని మధ్యలోనే ముగించి వెళ్లిపోయారు. టీఎంసీ కార్యకర్తలు తనపై దాడి చేశారని, కొట్టడంతోపాటు పంచ్‌లు ఇచ్చారని దిలీప్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో భవానీపూర్‌లో ప్రచారం నిర్వహించే పరిస్థితి లేదన్న దిలీప్‌ ఘోష్ ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికను వాయిదా వేయాలని ఈసీని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News