ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
Mohan Bhagat: ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
Mohan Bhagat: హిందువులు ముస్లింలు వేర్వేరు కాదు... భారతీయుల డీఎన్ఏ ఒక్కటేనంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గోరక్షకుల పేరుతో అమాయక ముస్లింలపై దాడులు జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది... గతంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉన్నవారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించింది.
ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ముస్లింలను ఇండియాలో నివశించొద్దనే వారు హిందువులే కారన్నారు. దేశంలో ముస్లింలకు ప్రమాదమన్న భావన అక్కర్లేదన్నారు. దేశంలో హిందువులుగానీ... ముస్లింల డామినేషన్ గానీ అక్కర్లేదన్నారు. హిందు-ముస్లిం సమస్యలకు చర్చలే పరిష్కారమని చెప్పారు. ఉచకోత కోసే వారు హిందూ వ్యతిరేకులని... ప్రార్థనల ఆధారంగా మత విభజన జరగరాదన్నారు. హిందు-ముస్లింల ఐక్యతపై కొందరు పెడర్థాలు తీస్తున్నారన్నారు మోహన్ భగవత్.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు. భారతీయుల డీఎన్ఏ ఒక్కటేనంటూ భగవత్ వ్యాఖ్యలపై అసద్ అభ్యంతరం వ్యక్తం చేశారు... ముస్లింలకు వ్యతిరేకంగా... జరుగుతున్న దాడులకు సంబంధించి... నేరస్తులకు హిందూత్వ ప్రభుత్వం మద్ధతుందన్నారు. ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్న వారు హిందూత్వ వ్యతిరేకులని భగవత్ చెబుతున్నా... నేరాలకు పాల్పడుతున్నవారికి అధికార పార్టీ అండదండలున్నాయని అసద్ ఆరోపించారు. గోరక్షకుల పేరుతో ముస్లింలపై దాడులు జరిగితే... అందరూ చూస్తూ ఊరుకున్నారని... ప్రభుత్వ పెద్దలు సన్మానించారన్నారు అసద్. పిరికితనం, హింస, హత్యలు... గాడ్సే హిందుత్వ ఆలోచనలో అంతర్భాగమని... ముస్లింలను కించపరచడం ఆ ఆలోచనలో భాగమన్నారు అసదుద్దీన్ ఒవైసీ...