Delhi Liqour Scam: లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఛార్జ్‌షీట్లను పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు

Delhi Liqour Scam:సౌత్‌ గ్రూప్‌ పాత్రపై ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఈడీ

Update: 2023-05-01 11:41 GMT

Delhi Liqour Scam: లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఛార్జ్‌షీట్లను పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు

Delhi Liqour Scam: లిక్కర్ స్కాం మనీలాండరింగ్‌ కేసులో ఈడీ మరోసారి కవిత పేరును ప్రస్తావించింది. కేసులో దాఖలు చేసిన రెండు, మూడు ఛార్జ్‌షీట్లలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసుల పేర్లను చేర్చింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్‌ అయిన గౌతమ్‌ మల్హోత్ర, మాగుంట రాఘవ, అమన్‌ దీప్‌, అరుణ్‌ పిళ్లై స్టేట్‌మెంట్స్‌, విచారణల ఆధారంగా అభియోగ పత్రాలను దాఖలు చేసింది ఈడీ. ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగిన సమావేవాలు, వాట్సాప్ ఛాట్స్‌, సిగ్నల్ యాప్, కాల్‌ డేటా, ఈ మెయిల్స్‌, మొబైల్ ఫోన్లలో లభించిన సమాచారాన్ని ఛార్జ్‌షీట్‌లో నమోదుచేసింది.

లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించుకోవడంతో పాటు కమీషన్ రేట్లు పెంచడం.. ముడుపుల వ్యవహారాల్లో సౌత్ గ్రూప్ పాత్రను ఛార్జ్‌ షీట్‌లో పేర్కొంది. సౌత్‌గ్రూప్‌ విజయ్‌ నాయర్ ద్వారా ఇచ్చిన వంద కోట్ల ముడుపుల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది..? ఎలా సమకూర్చారు అనే అంశాలను కూడా ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఛార్జ్‌షీట్లను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ప్రొడక్షన్ వారెంట్ జారీ చేస్తూ.. తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది.

Tags:    

Similar News