Kerala: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం
Kerala: ఎదురెదురుగా ఢీకొన్న బస్సు-కారు
Kerala: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న బస్సు..కారు రెండు పరస్పరం ఢీకొన్నాయి. వేగంగా వస్తూ కారును ఢీకొట్టిన బస్సు..అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చర్చ్ గోడను ఢీకొట్టింది. దీంతో చర్చ్ ఎంట్రన్స్ ధ్వంసమైంది. పూర్తిగా కూలిపోవడంతో ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అటు కారులో ప్రయాణిస్తున్న వారికి కూడా తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీసీటీవీలో రికార్డ్ అయిన ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.