Atul Subhash suicide case: అతుల్ సుభాష్ సూసైడ్ కేసులో పరారైన భార్య, అత్త, బామ్మర్ది అరెస్ట్

Atul Subhash suicide case: అతుల్ సుభాష్ సూసైడ్ కేసులో పరారైన భార్య నిఖితా సింఘానియా, అత్త నిషా, బామ్మర్ది అనురాగ్ అరెస్ట్

Update: 2024-12-15 06:42 GMT

Atul Subhash suicide case: అతుల్ సుభాష్ సూసైడ్ కేసులో ఆయన భార్య, అత్త, బామ్మర్దిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాదికి చెందిన అతుల్ సుభాష్ బెంగళూరులో ఏఐ ఐటీ ప్రొఫెషనల్ గా పని చేస్తూ ఇటీవలే ఆత్మహత్య చేసుకోవడం పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

తన భార్య నిఖితా సింఘనియా, ఆమె తల్లి నిషా, ఆమె సోదరుడు అనురాగ్ ల వేధింపులు భరించలేక తను సూసైడ్ చేసుకుంటున్నట్లు అతుల్ సుభాష్ రాసిన సూసైడ్ నోట్ దేశ వ్యాప్తంగా అనేక చర్చలకు దారితీసింది. అతుల్ సూసైడ్ నోట్ ఆధారంగా కేస్ దర్యాప్తు చేస్తున్న బెంగళూరు పోలీసులు వస్తున్నట్లు తెలుసుకున్న నిఖిత, నిషా, అనురాగ్ ఇంటి నుంచి పరారయ్యారు.

తాజాగా వీరి కదలికలను ట్రేస్ చేసిన పోలీసులు ఆదివారం నిఖితను హర్యానాలోని గుర్గావ్ లో, ఆమె తల్లి నిషాను, సోదరుడు అనురాగ్ ను యూపీలోని అలహాబాద్ లో అరెస్ట్ చేశారు.  

అతుల్ సుభాష్ సూసైడ్ నోట్ లో ఏముంది?

భార్య నిఖితా సింఘానియ తనపై పెట్టిన కేసులు విత్ డ్రా చేసుకోవడానికి రూ 3 కోట్లు డిమాండ్ చేసినట్లు అతుల్ సుభాష్ సూసైడ్ నోట్ లో ఉంది. అంతేకాకుండా తన కొడుకుని చూసేందుకు అనుమతి ఇవ్వడానికి మరో రూ 30 లక్షలు డిమాండ్ చేసినట్లు అతుల్ ఆ లేఖలో ఆరోపించారు. 

18 పేజీల సూసైడ్ నోట్ తో పాటు 81 నిమిషాల నిడివి గల ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు న్యాయం కావాలి అని మెడలో ఒక ప్లకార్డ్ వేసుకుని చేసిన ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. 

Tags:    

Similar News