LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
L K Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి(Apollo Hospital)లో చేర్పించారు. ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు అపోలో ఆస్పత్రికి చేరుకుని అద్వానీ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
రెండు నెలల క్రితం కూడా ఆయన ఢిల్లీ(Delhi) అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అంతకుముందు ఎయిమ్స్ లోనూ ఆయన చికిత్స పొందారు. అద్వానీ గత కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. తొమ్మిది పదుల వయసు దాటడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.